Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
రాష్ట్ర ప్రభుత్వం బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటుచేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు.సోమవారం పట్టణపరిధిలోని దద్దనాల చెరువుకాలనీ, ఒకటో వార్డు కాలనీలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.తమకు సమీపంలో ఆయా వార్డులలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దృష్టిలోపాలున్న వారంతా హాజరై పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.