Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
రైతులకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్‌లోన్స్ అందిస్తామని కెనరా బ్యాంకు వరంగల్-1రీజినల్ మేనేజర్ సీవీ.రాంబాబు తెలిపారు.సోమవారం కెనరాబ్యాంక్ మునగాల శాఖలో ప్రత్యేక విభాగమైన గోల్డ్‌లోన్ ప్లాజాను ప్రారంభించి మాట్లాడారు.కెనరా బ్యాంక్ నందు వేగవంతమైన బంగారు రుణాలను అందించేందుకు ప్రత్యేక విభాగమైన గోల్డ్‌లోన్ రాజాను ఏర్పాటు చేశామన్నారు.కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఖాతాదారులకు బంగారు రుణాలను అందించడం ఈ యొక్క ప్లాజా ఉద్దేశమని చెప్పారు.ఏ మాత్రం ముందస్తు చెల్లింపుచార్జీలు ఉండవని తెలిపారు.బ్యాంకులో అకౌంట్ లేని వారికి అకౌంట్ ఓపెన్ చేసి బంగారు రుణసౌకర్యం కల్పిస్తామని చెప్పారు.ప్రతి గ్రాము బంగారానికి అత్యధిక రుణాన్ని తక్కువవడ్డీకి అందిస్తామని తెలిపారు.వ్యవసాయదారులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులు రుణసౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ మధుసూదన్ బ్యాం క్ సిబ్బంది పాల్గొన్నారు.