Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఈనెల 27న ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు.సోమవారం పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి నేటి వరకు అమలు చేయకుండా మాదిగలను మోసం చేసిందన్నారు.ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ ఇచ్చిన పిలుపుమేరకు మాదిగలు అధిక సంఖ్యలో తరలివచ్చి చలోఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఎలమర్తిరాము,ఎమ్మార్పీఎస్ కోదాడ మండల ఇన్చార్జి పిడమర్తి వెంకట్రావు, ఎమ్మెస్పీ మునగాల మండల నాయకులుఅంజయ్య,శ్రీనివాస్, అనంతగిరి మండల నాయకులు కుటుంబరావు, పట్టణ ఇన్చార్జి ఏపూరి సత్యరాజ్, పిడమర్తి చిన్నవెంకటరావు, ప్రవీణ్, నాగేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.