Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ గౌడలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా యాదగిరిగుట్టలో వేలాదిమంది గీత కార్మికులతో జరిగిన బహిరంగ సభలో 25 తీర్మానాలు చేసి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశామన్నారు.ద్విచక్ర వాహనాలు ఇస్తామన్నారు.గీతన్నబంధు, గీతన్నబీమా,పదిరోజుల్లో ఎక్స్గ్రేషియా, సొసైటీలకు లిక్కర్ షాపులు ఇస్తామన్నారు.ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెల్గూరి గోవిందు, మడ్డి అంజిబాబు మాట్లాడుతూ 2022-23 బడ్జెట్లో కేటాయించిన డబ్బులు టాడి కార్పొరేషన్ కు ఇవ్వాలని తద్వారా సేఫ్టీ మోకు, ద్విచక్ర వాహనాలు తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల భూములకు ధరలు విపరీతంగా పెరగడంతో భూ యజమానులు తాటి ఈత చెట్లు తొలగిస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెన్షన్ రూ. 5వేలకు, ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గౌడ యువతీ యువకులకు ఉపాధి కలిగించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా, తాటిఉత్పత్తుల పరిశ్రమ పెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అబ్బగాని భిక్షం, జిల్లా సహాయకార్యదర్శి ఉయ్యాల నగేష్,గుణగంటికృష్ణ, బోడపట్ల జయమ్మ, కొండ అన్నపూర్ణ,బాలగోని రేణుక, జెర్రిపోతుల కష్ణ,బత్తులజనార్దన్, బట్టుపల్లి నాగమల్లయ్య, నోముల వెంకన్న, బుర్ర యల్లగౌడ,దోనేటి పిచ్చయ్య, బెల్లంకొండ వెంకటేశ్వరు,పొడిశెట్టి సైదులు, అబ్బ గాని కాశయ్య, ఆకులరమేశ్,మండవ సైదులు, బెల్లంకొండ ఇస్తారు,కారింగులసైదమ్మ, మామిడి భద్రమ్మ, గుణగంటి వెంకన్న, బుర్ర పూలమ్మ, బోడ సైదులు బత్తిని రాములు కప్పల సత్యనారాయణ పెండెం వెంకయ్య మామిడి ఎంకన్న చనగాని సైదులు పందిరి సైదులు గుండు అంజయ్య అబ్బ గాని యాదగిరి ఎలుగూరి జానయ్య మండలి జాన్పాషా వల్లభదాసు దుర్గయ్య కార్యాల గురవయ్య గుణగంటి సైదులుతదితరులు పాల్గొన్నారు.