Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ పాటిల్హేమంత కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంత కేశవ్ తెలిపారు.ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగే గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో ఫిర్యాదుదారుడు నుంచి వచ్చిన విన్నపాలను పరిశీలించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్లకు 12 దరఖాస్తులు, ఆర్డీవోకి 4 దరఖాస్తులు, టీఎస్‌ట్రాన్స్‌కో ఒక దరఖాస్తు, డీడబ్య్లూఓ నాలుగు దరఖాస్తులు, డీఈఓ ఒకదరఖాస్తు, డీటీడీఓకు ఒకటి, డీఆర్ఓ సూర్యాపేటకు 1 దరఖాస్తు, పీడీ డీఆర్డీఓకు 4, ప్రభుత్వఆస్పత్రిపై 5 దరఖాస్తులు మొత్తం 33 దరఖాస్తులు వచ్చాయన్నారు.వీటిలో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు.ఈ దరఖాస్తులను త్వరగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సురేష్, డీఆర్ఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీదేవి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.