Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
సీఐటీయూ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు తిరందాసు గోపి స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కార్మిక ఉద్యమ నేత తిరందాస్ గోపి 6వ వర్థంతి సీఐటీయూ జిల్లా కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేసి దోపిడీ నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా అనేక కార్మిక ఉద్యమాలు నిర్మించిన చరిత్ర తిరందాస్ గోపిదని ఆయన సేవలను కొనియాడారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీకి కార్మిక వర్గం రైతన్న వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం సమస్యల పైన నిరంతరం నికరంగా పోరాడమే తిరందాసు గోపికి అర్పించే నిజమైన నివాళులన్నారు. ఈ వర్థంతి సభలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణచారి, జిల్లా సహాయ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య, చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, నాయకులు పుచ్చకాయల నర్సిరెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ, జంజీరాల శ్రీనివాస్, నాయకులు ఎన్.సుందరయ్య, ఆర్ .రామచంద్రు, పేర్ల సంజీవ, దండంపెళ్లి సైదులు, సైదులు, పీ.మనీషా, ఏ.సునీత, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.