Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జువాలజి అపార్ట్మెంట్, డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి ఆద్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం (వరల్డ్ స్పారో డే)ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా పర్యావరణ ప్రేమికుడు సురేశ్ గుప్త హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ, పిచ్చుకల పరిరక్షణ ప్రతిపౌరుడి బాధ్యతగా నిర్వహించాలన్నారు. కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీను, ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట్‌రెడ్డిలు విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ కోసం దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థుల చేత కళాశాల ఆవరణంలోని పక్షుల కోసం ఆహార ధాన్యపు తొట్టెలు కట్టించారు. ఈ కార్యక్రమంలో జువాలజి డిపార్ట్మెంట్ అధ్యాపకులు మహీశ్వరి, సరిత, గిరిబాబు, అనిత, వెంకటయ్య, అద్యాపక, అద్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.