Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
అకాల వర్షాలు కారణంగా వాతావరణంలో పెను మార్పులు, ఫిబ్రవరి ,మార్చి నెలలలో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు విష జ్వరాల బారినపడుతున్నారు. మండల కేంద్రంతోపాటు , బహుదూరుపేట సాయి గూడెం ,వివిధ వార్డుల్లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులకు ప్రజలకు క్యూ కడుతున్నారు. జ్వర పీడితులకు వాంతులు , విరేచనాలు, కడుపునొప్పి, వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వంటి కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మాస్కులు ధరించకపోవడం, కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం చిన్న పిల్లలు మట్టిలో ఆడుతూ చేతులు కడుక్కో పోవడం కారణంగా తిన్న ఆహారం కలుషితమై వాంతులు ,విరోచనాలు కావడానికి ఆస్కారం ఉంటుందని వైద్యులు అంటున్నారు. బీపీ, డయాబెటిక్ దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు ఆరు బయట తిరగకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. విద్యార్థులకు ఒంటిపూట పాఠశాలల నుండి ఎండలోనే ఇంటి వద్దకు చేరుకోవడం జరుగుతుంది. ఎండ దెబ్బ తగలడంతో జ్వరాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. మరో 20 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు విషపూరితంగా ఉంటాయంటున్నారు.
విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్
అకాల వర్షాల కారణంగా వాతావరణంలో పెను మార్పులు వచ్చాయి. కోల్డ్, వైరల్ ఫీవర్ దోమల కారణంగా విష జ్వరాలు వస్తున్నాయి. మాస్కులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధరించాలి. జ్వరాలతో శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉందిం చల్లటి వాతావరణంలో వాము వాటర్ , గోరువెచ్చని నీరు ప్రతి ఒక్కరూ తాగాలి. రోగనిరోదక శక్తి పెంచేందుకు విటమిన్లు, ప్రోటీన్లు కలిగిన పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. విటమిన్ సీ, డీ3 కాల్షియం వంటి మాత్రలు వేసుకోవాలి. మరో 20 రోజులపాటు వాతావరణ పరిస్థితులు బాగా లేవు. గతంలో ఎన్నడలేని విధంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఆహారాన్ని ఎప్పటికప్పుడు వేడివేడిగా తీసుకోవాలి.