Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
బీజేపీ మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంక్షేమం, మతసామరస్యం, లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర ఈనెల 28న భువనగిరి పట్టణానికి వస్తున్నదని, పట్టణంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్లో ఆ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జిట్టా అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహోజ్వల చరిత్ర కలిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భువనగిరి ప్రాంత ఉద్యమానికి వన్నెతెచ్చిన కామ్రేడ్ దుంపల మల్లారెడ్డి స్మారకార్థం పట్టణంలో నిర్మించిన స్మారక భవనం, సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం 28న ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు, అభ్యుదయవాదులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గసభ్యులు కొండ అశోక్,మండల కమిటీ సభ్యులు ఎల్లంల వెంకటేష్, పాండాల మైసయ్య, మోటె ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, సిలువేరి ఎల్లయ్య, కొండాపురం యాదగిరి, నరాల చంద్రయ్య,కూకుట్ల క్రిష్ణా, మండల నాయకులు చంద్రమౌళి, శివ పాల్గొన్నారు.