Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిక్కు దివాన లేని పార్టీ కాంగ్రెస్
- మోడీ లాంటి శత్రువులు దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
- బీఆర్ఎస్ ర్యాలీ, ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ- రామన్నపేట
దేశంలోని అనేక రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజల లాగా రెండు పూటలా అన్నం తినడం లేదని, సుభిక్షంగా ఉన్నది తెలంగాణ ప్రజలేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెపి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ మండల అధ్యక్షుడు మందడి ఉదరు రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దేశం గర్వించదగ్గ సంక్షేమ పథకాల గురించి కులంకషంగా వివరించాలన్నారు. రామన్నపేట మండలంలో ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, కెేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా వందల కోట్ల రూపాయల లబ్ది ప్రజలకు చేరిందని ఆయన అంకెల రూపంలో కార్యకర్తలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే, బీఆర్ఎస్వల్లనే నేడు రాష్ట్రం నుండి దరిద్రం పారిపోయిందని తెలిపారు. మోడీ సొంత రాష్ట్రంలోని గుజరాత్లో 35 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆరోపించారు. 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో 45 కోట్ల మంది ప్రజలు ఆకలి బాధలు పడుతున్నారన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు తమ రాష్ట్రాలలో అమలు కావాలని వారు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఆదానికి మోడీ బినామీ అని, దేశ సంపదను కుబేరులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దిక్కు దివాణం లేని పార్టీని, ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మోడీని అనుకరిస్తున్నారని ఆయన విమర్శించారు. మూడిలాంటి శత్రువులు బీిఆర్‌ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారని ప్రజలు నమ్మొద్దని కోరారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలని, ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. వ్యవసాయం దండగ అంటే పండగ చేసి చూపిన వీరుడు కేసీఆర్ ఆయన కొనియాడారు. మండలంలో 7651 మందికి 2016, కొందరికి 3016 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయని, 1868 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం కింద అందించామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 698 మందికి సహాయం చేయగా, రైతుబంధు ద్వారా 1578 మందికి పెట్టుబడి సహాయం అందిందని, 167 మందికి రైతు భీమా వర్తించిందని ఆయన తెలిపారు. 148 మందికి కెసిఆర్ కిట్టు అందజేశామని, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మెన్లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహ రెడ్డి హాజరై బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, పీఏసీిఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్‌్ కంభంపాటి శ్రీనివాస్, ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు పోతరాజు సాయికుమార్, వివిధ గ్రామాల సర్పంచులు ఎడ్ల మహేందర్ రెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, గుత్తా నరసింహారెడ్డి, కాటేపల్లి సిద్ధమ్మ, ముత్యాల సుజాత, మెట్టు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్ రెడ్డి, దోమల సతీష్, గొరిగే నరసింహ, గాదె పారిజాత, ఏనుగు పుష్పమ్మ, గోగు పద్మ, నాయకులు పున్న జగన్మోహన్, అంతటి రమేష్, బద్దుల రమేష్, మామిళ్ళ అశోక్, జాడ సంతోష్, కునూరు ముత్తయ్య, వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.