Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సరీల నిర్వహణ పట్ల కార్యదర్శుల పై ఆగ్రహం
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ-గుండాల
ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన మహిళలతో ఆమె మాట్లాడుతూ మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడంకోసం ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టారని, ఈకార్యక్రమం ద్వారా మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తారని తెలిపారు. గ్రామాలలో ఆశా వర్కర్ల ద్వారా ఆరోగ్య మహిళా కేంద్రాలలో నిర్వహించే పరీక్షల వివరాలను క్షేత్రస్థాయిలో మహిళలకు తెలిసేలా పనిచేయాలని,ఆసుపత్రులలో అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలని,గ్రామ సభల ఏర్పాటు ద్వారా మహిళలతో సమావేశమై వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలని, తగిన సలహాలు అందించాలని తెలిపారు. ఈ ఆరోగ్య మహిళా కేంద్రంలో జరిగే పరీక్షల వివరాలను మండల వైద్యాధికారి డాక్టర్ హైమావతిని అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్,జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్ లు మండల కేంద్రానికి ప్రత్యేక 108వాహనం ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రిలో రికార్డులను,సిబ్బంది పనితీరు పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.మండల కేంద్రంతో పాటు పాచిల్ల గ్రామాల నర్సరీల నిర్వహణ,పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.పల్లే ప్రకృతి వనం,నర్సరీలను పరిశీలించిన ఆమె వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని మొక్కల రక్షణ కోసం షేడ్ నెట్ పెట్టాలని,ఎప్పటికప్పుడు వాటరింగ్ చేపట్టాలని, బెడ్లలో కలుపు మొక్కలు లేకుండా చూడాలని,నర్సరీ చుట్టుపక్కలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందేనంటూ అసహనం వ్యక్తం చేస్తూ వెళ్ళిపోయారు.ఈకార్యక్రమాల్లో తహశీల్దార్ జ్యోతి,ఎంపీడీవో శ్రీనివాసులు,పంచాయతీ కార్యదర్శులు రమేష్,మౌనిక,ఫీల్డ్ అసిస్టెంట్ నవనీత తదితరులు పాల్గొన్నారు.