Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
బాలికలను లైంగికంగా వేధిస్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్పై ఫోక్సో చట్టంకింద కేసు నమోదు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమే పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు చేసిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వాష్రఉమ్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటైన విషయం అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి పనులు చేయడం బాధాకరమన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుర్తింపు రద్దుచేసి, ఫోక్సో కేసు నమోదు చేయాలి
భువనగిరిరూరల్ : బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసిన, భువనగిరి పట్టణం లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుర్తింపు రద్దుచేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి, జిల్లా బాలల పరిరక్షణ కమిటీ కి ఆయన వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం, బాలికలను లైంగిక వేధింపులకు గురి చేయడం పరిపాటిగా మారిందన్నారు. గతంలో చౌటుప్పల్ మండల కేంద్రము లో ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడిన, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ ప్రజల చేతిలో దెబ్బలు తిన్నారని ఆయన గుర్తు చేశారు. ఆలస్యంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులను విపరీతంగా కొట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్న కరస్పాండెంట్ రఘు వెంకట సురేష్ పై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.