Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెంతోపాటు ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని అంకిరెడ్డిగూడెం, జిల్లేడుచెల్క గ్రామాల్లో ఈ నెల 19న వచ్చిన వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ భారతీయ కిసాన్ మోర్చ పట్టణ అధ్యక్షులు బి.మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంగళవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్ మాట్లాడారు. వడగండ్ల వానతో చేతికి వచ్చిన వరి, పండ్ల తోటలు, కూరగాయల తోటలు మొత్తం నేలపాలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కడారి అయిలయ్య, యాదిరెడ్డి, బత్తుల జంగయ్యగౌడ్, లింగస్వామి, అశోక్‌రెడ్డి, కల్పన, స్వప్న, సాయికుమార్‌గౌడ్, గణేశ్, శంకర్ పాల్గొన్నారు.