Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్ధిదారుల లిస్టు ప్రకటించని అధికారులు
- డబ్బులిస్తేనే డబులు బెడ్రూం ఇండ్లు
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలో డబ్బులిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారా అన్న ప్రశ్నకు అధికారులే సమాధానం చెప్పాలి.మంగళవారం అంబేద్కర్ కాలనీలో బాధితులు ఆందోళన చేశారు.మూడు రోజులు అవుతున్న లబ్ధిదారుల వివరాలు తెలపకపోవడం పై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.డబుల్ బెడ్ రూమ్ డ్రాలో చనిపోయిన వ్యక్తికి కూడా వచ్చిందని, ఆర్పీలకు,కౌన్సిలర్ బంధువులకు, కౌన్సిలర్లకు వచ్చాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనాగానీ డ్రాలో అధికారులు మహిళల కళ్ళు కప్పి మోసగించారని చర్చించుకుంటున్నారు.ఇప్పటికే అనేకమంది మహిళలు నిరసనలు తెలిపారు.వారిని మెప్పించడం కోసం ఆర్డీవో కార్యాలయంలో వారి పేర్లు రాసుకుని మరో స్కీములో మీకు అవకాశం కల్పిస్తామని నమ్మబలికి వారిని పంపించారు.మూడు రోజులు గడుస్తున్న లిస్ట్ ఇవ్వకపోవడం ఏంటని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.ఎన్నో ఏండ్లుగా తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని ఎదురుచూసి ఎదురుచూసి తీరా రాకపోయేసరికి మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇప్పటికే నాయకులు ఆశావాహుల వద్దకు వెళ్లి భేరసారాలు సాగిస్తున్నారన్నారు.రూ.లక్ష నుండి రూ.2 లక్షల వరకు కడితే ఇండ్లు వస్తదని ఆశచూపిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.పై అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.