Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరస్‌తో మాడిపోయిన చెట్లు
- పువ్వు తెంపేందుకు జంకుతున్న జనం
- పచ్చడిలో వేసుకోవాలా ? వద్దా ?
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఉగాది నాటికి ఆకురాలి కొత్త చిగుళ్లు వేయడంతో పాటు పూత పూయాల్సిన వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి.ఒకప్పుడు ఉగాది వచ్చిందంటే ఇంటి ఆవరణలోనో, ఇంటికి ఆ పక్కో, ఈ పక్కో దొరికిన వేపపువ్వు కానీ ఇప్పుడు వేప పువ్వు కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.సూర్యాపేట జిల్లా పరిధిలో నాలుగేండ్ల కింద వేప చెట్లపై కనిపించిన వైరస్ ప్రభావం క్రమంగా పల్లెలకు విస్తరించింది.రాష్ట్రంలోని ప్రతి 10 వేప చెట్లలో 8 వైరస్ ప్రభావంతో మాడిపోయాయి.కొన్ని చెట్లు సగం ఎండిపోగా ఇంకొన్ని ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి.పూర్తి ఆరోగ్యంగా ఉన్న చెట్లు ఎక్కడో ఒకటి, రెండే కనిపిస్తున్నాయి ఉన్నాయి.వాటికి కూడా చిటారు కొమ్మల్లో పువ్వు ఉంటోంది. పల్లెలు, పట్టణాలలో కాంక్రీట్? నిర్మాణాల కారణంగా వేపచెట్లు క్రమంగా మాయమవుతున్నాయి.
పచ్చడిలో వేసుకోవాలా ? వద్దా ?
తెలుగు సంవత్సరాది రోజు చేదు రుచులతో ఉగాది పచ్చడి చేసుకోవడం తెలుగు ప్రజల ఆచారం.ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు ఇలా ఆరు రుచులతో ఉగాది పచ్చడి చేయడం ఆనవాయితీ. పులుపు కోసం చింతపండు, వగరు కోసం మామిడి పిందెలు, తీపి కోసం బెల్లం, చేదు రుచి వచ్చేందుకు వేపపువ్వును వాడుతారు. తెగుళ్ల బారినపడి చెట్లు ఎండిపోతుండడంతో వేప పూతను పచ్చడిలో కలుపుకోవాలా వద్దా అనే విషయంలో ప్రజలు వెనకాడుతున్నారు.