Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధిహామీ పనులు విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని,అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీడీ కిరణ్‌కుమార్ కోరారు. మంగళవారం మండలకేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీచట్టం, సామాజికతనిఖీపై, నిర్వహించిన బహిరంగప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఈ మేరకు ప్రతి గ్రామపంచాయతీలో కూడా ఉపాధిపనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని సూచించారు.కూలీలు నిబంధనల ప్రకారం పనులు చేసి తగిన వేతనాన్ని పొందాలన్నారు.మూడేండ్లలో మండలంలో రూ.16 కోట్ల ఉపాధి హామీపనులు జరిగాయన్నారు.కూలీలకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే, వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంబుడ్స్‌మెన్ లచ్చీ రాంనాయక్, హెచ్ఆర్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భీమ్సింగ్నాయక్, ఎస్టీఎం అజరుకుమార్,ఎస్ఆర్పీ రమేష్,ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్,డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటిసైదులు, సర్పంచులఫోరం మండలఅధ్యక్షులు నల్లు రామ చంద్రారెడ్డి,సర్పంచులు గుగులోత్ఈరోజి, గుజ్జ పూలమ్మ, యాదమ్మ, మాన్సింగ్,యాకునాయక్,ఏపీఓలు కృష్ణయ్య,వెంకన్న,ఈసీ భిక్షం, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.