Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎస్.వెంకట్రావ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను మాసంతానికి పూర్తి చేయాలని కలెక్టర్ యస్.వెంకట్రావ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం పట్టణంలోని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో ఎంజీరోడ్డు తరహాలో అన్ని రోడ్లలో గ్రీనరీ మరింత పెంచాలన్నారు.అలాగే ప్రజారవాణా వ్యవస్థకు ఎక్కడకూడా ఇబ్బందులు కలగకుండా నాణ్యతాప్రమాణాలతో చేపట్టాలని ఆదేశించారు.పట్టణంలో గల మున్సిపల్ పార్కులలో పారిశుధ్యపనులు చేపట్టి సుందరీకరణగా ఉంచాలని సూచించారు. అనంతరం ఎంజీరోడ్డు, కోర్టుచౌరస్తా పలు ప్రాంతాలలో రోడ్లను పరిశీలించి సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.