Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మతసామరస్యం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామిక రక్షణ కోసం సీపీఐ(ఎం) అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్రెడ్డి కోరారు.మంగళవారం మండల కేంద్రంలోని తోట్ల మల్సూర్ స్మారక భవనంలో మాట్లాడుతూ ఈనెల 25,26 న ఈ యాత్ర జిల్లాకు రానున్నదని తెలిపారు. మోడీ,అమిత్షా నేతృత్వ ంలోని బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో మండల నాయకులు బత్తులజనార్దన్, ఎర్ర ఉప్పల్రెడ్డి, కూసు బాలకృష్ణ, దాసరి రవి, సామదామోదర్రెడ్డి, తొట్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్: ఈ నెల 25న హుజూర్నగర్లో జరిగే జన చైతన్యయాత్రను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం కోరారు.పట్టణపరిధిలోని అనుముల గూడెంలో నిర్వహించిన శాఖ సమావేశం అనంతరం పోస్టర్ను ఆవిష్కరి ంచారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల మురళి, శంభయ్య, కుక్కడపు వెంకన్న, భద్రయ్య, గోవిందమ్మ తది తరులు పాల్గొన్నారు.
చిలుకూరు: సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్యయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి నాగాటి చినరాములు కోరారు.మండలంలోని కొండాపురం గ్రామంలో జన చైతన్య యాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేనేపల్లి వెంకటేశ్వరరావు, కొండాపురంఉపసర్పంచ్ యాదాల వీరస్వామి, సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి భాష్యం లింగమల్లయ్య, గుండపనేని సీతయ్య, నిమ్మలసైదులు, కీత నాగేశ్వర్రావు పాల్గొన్నారు.