Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్య నాటికలో కర్నూల్ మొదటి స్థానం
- సాంఘిక నాటికలో ప్రథమస్థానంలో హైదరాబాద్ నాటికలు సజీవంగా ఉండాలి
- ఎమ్మెల్సీ కోటిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పద్య సాంఘిక నాటక పోటీలు మంగళవారం ముగిశాయి.ఈనెల 10న ప్రారంభమైన నాటిక పోటీలు 11 రోజులపాటు ఉత్సాభరితంగా సాగాయి. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన 19 కళాబృందాలు నాటికలు ప్రదర్శించారు. పద్య నాటక పోటీల్లో కర్నూలు టీజీవి కళాక్షేత్రం నిర్వహించిన శ్రీకృష్ణ కమల పాలిక నాటకం ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది.కాకినాడకు చెందిన శ్రీ సీతారామాంజనేయ నాట్యమండలి నిర్వహించిన నర్తనశాల నాటకం ఉత్తమ ద్వితీయ ప్రదర్శనకు ఎంపికైంది.ఇందులోనే హైదరాబాదకు చెందిన శ్రీ మురళీకృష్ణ నాట్య మండలిచే చేసిన వసంత రాజీయం ఉత్తమ తృతీయ ప్రదర్శన నిలిచింది.వరంగల్ స్టార్ బ్రదర్స్ సంస్కృతిక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయం నిరుద్దము జ్యూరీ ప్రదర్శనగా ఎంపికైంది.ఎంపికైన కళాబృందాలకు రూ.40 వేలు, రూ.30వేలు, రూ.20 వేల చొప్పున నగదు పురస్కారంతో పాటు మెమొంటోలు అందజేశారు.సాంఘిక నాటికపోటీల్లో హైదరాబాదుకు చెందిన కర్టెన్కాల్ థియేటర్ నిర్వహించిన పెట్రోమాక్స్ పంచాయతీ నాటకం ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. దీనికి 20వేలు నగదు ప్రోత్సాహం ఇచ్చారు.హైదరాబాద్ సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన థింక్ నాటకానికి ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాభారతి నిర్వహించిన చీకటిపువ్వు నాటకానికి ఉత్తమతృతీయ ప్రదర్శనగా నిలిచింది.వీరికి రూ.15 వేలు, రూ.10 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు.కొప్పోలు వారి పండు క్రియేషన్స్ నిర్వహించిన పక్కింటి మొగుడు నాటికకు జ్యూరీ ప్రదర్శనకు ఎంపికైంది.
నాటికలు సజీవంగా ఉండాలి
నాటికలు సజీవంగా ఉండాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే జూలకరి రంగారెడ్డి కోరారు.నాటిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు.నాటికలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఉండాలన్నారు.11 రోజులుగా సాగిన పోటీలు ప్రజల్లో ఆలోచింపజేశాయని చెప్పారు జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.కళాకారులకు అన్నివేళలా సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కళాకేంద్రం అధ్యక్ష కార్యదర్శులు బోయినపల్లి భుజంగరావు,పులికృష్ణమూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామావతారం, కోశాధికారి లక్ష్మీనారాయణ శర్మ, మామిడాల ఉపేందర్, పి.శ్రీనివాస్, శ్రీనివాస్‌శర్మ, చిల్లంచర్ల చంద్రశేఖర్, బాపణయ్య, బాబూరావు రఘువయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.