Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యార్థుల కవిత్వం రాయాలంటే తమ జీవితాల్లోకి తగ్గించుకోవాలని ఇంటా బయట బడిలో జరుగుతున్న సంఘటనలను చూస్తూ స్పందించాలని ప్రముఖ రచయిత్రి ఉప్పల పద్మ అన్నారు.బకల్వాడీ పాఠశాలలో మంగళవారం ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిత్వం ఎలా రాయాలో, ఎందుకు రాయాలో, తను ఎలా కవిత్వం రాసిందో, ఎదిగిందో విద్యార్థులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాగా చదవడం రాయడం ద్వారానే విద్యార్థులు భవిష్యత్లో రచయితలుగా మారే అవకాశం ఉంటుందన్నారు.అందుకు బాగా గ్రంథాలయంలోని పుస్తకాలు చదవాలన్నారు.ఆమె రాసుకున్న కవిత స్త్రీ మీద స్త్రీ శ్రమ మీద విద్యా చదువు మీద రాసుకున్న కవితను ఈ సందర్భంగా చదివి వినిపించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆర్టీసీ డీఎం పాల్ తనదైన గానంతో విద్యార్థులను మనసుల్ని గెలిచారు.పువ్వు ఎలా వికసిస్తుందో విద్యార్థులు చదువుతూ అలా వికసించాలని తన మాట పాటలతోటి అద్భుతంగా విద్యార్థులకు అద్భుతమైన ఉపన్యాసం అందించారు.ఈ సందర్భంగా. ప్రముఖ కవి రావిరాల అంజయ్య విద్యార్థుల బాల్యం చాలా అమూల్యమైనదని, పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఇతర అంశాల పట్ల దృష్టి సారించాలని తన గానం కవితతో విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు.38 మంది విద్యార్థినీ విద్యార్థులు తాము స్వతహాగా రాసుకున్న కవిత్వాన్ని ఆంగ్లంలో తెలుగులో చదివి సమావేశంలో ఎంత గాడతను వ్యక్తం చేశారని గిరిజన గురుకుల కళాశాల ఆంగ్ల ఉపాధ్యాయులు వెంకటరత్నం విద్యార్థులను అభినందించారు.ప్రముఖ గాయకులు, ఆర్టీసీ మాజీ అధికారి లక్ష్మయ్య తన గేయాలతో విద్యార్థుల్లో ఒక సందేశాన్ని నింపారు.బాల వికాస వనం కన్వీనర్ కిరణ్మయి కమలాబాస్ ఇన్ రాసిన కవితను అమ్మాయిలు పర్వతాలు లాంటి వాళ్ళని ఎక్కడ తలవంచి బతకకూడదని తన సందేశాన్ని ఇచ్చారు. లీగల్తసి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ కవితా దినోత్సవంలో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొనగా 38 మంది విద్యార్థులు అద్భుతమైన కవితల్ని గానం చేశారు.వీరికి ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల ఆర్థిక సహకారంతో పాటు బహుమతుల్ని అందించగా ప్రభాకర్,ఉమాశంకర్ అందించారు.