Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా సోకిన వారికి ఆరోగ్య సమస్యలు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు మేలు చేసే మొక్కలు నాటించాల్సిన అధికారులు,ప్రజా ప్రతినిధులు ఆలేరు పురపాలక సంఘంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మధ్యలో స్ట్రీట్ లైట్లని అనుకొని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేసిన, అది పట్టించుకోకుండా కొనో కార్పరస్ పట్టణంలో నాటగా , అవి వక్షాలుగా మారుతున్నాయి.పురపాలక సంఘాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అహ్లాదకరమైన వాతావరణం ఉండాలని ప్రజలకు మేలు చేసే మొక్కలు నాటాలని ప్రభుత్వం ఒకవైపు హరితహారం లో భాగంగా ఆదేశాలు జారీ చేస్తుంటే, ఆలేరు పట్టణంలో ప్రాణాంతకరమైన మొక్కలు నాటారు.మొక్కలు అతి తక్కువ కాలంలోనే వక్షాలుగా మారుతాయి.వాటికి ట్రీ గార్డులు సైతం ఏర్పాటు చేశారు. ఇదే మొక్కలపై ప్రజల నుండి నిరసనలు వెల్లువెత్తడంతో జనగామ, సిద్దిపేట వంటి పట్టణాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర మున్సిపాలిటీలలో నాటారు.మున్సిపాలిటీలలోని అధికారులు స్పందించి వీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఆలేరు పట్టణంలో మాత్రం దీని విరుద్ధంగా ఉందని ఎన్నిసార్లు ,పాలకుల అధికారుల దష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని , మనుషులకు పక్షులకు , ఇతర జీవరాసులకు ఈ మొక్కల నుండి వచ్చే గాలి వల్ల చనిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు. చెట్లు జీవకోటికి, మానవాళికి మేలు చేసే విధంగా ఉండాలని, విషపూరితమైన చెట్లను ఎలా పెట్టారని నిలదీస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం తమకు విషపూరితమైన మొక్కలని తెలియదని చెబుతున్నారు.విషపూరితమైన మొక్కలు నాటడంతో, ప్రజల ఆరోగ్యానికి నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని గుండె జబ్బులు వస్తాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిషేధించిన చెట్లను ప్రజాధనం లక్షలక్షలు ఖర్చుపెట్టి ఆలేరు పట్టణంలో హరితహారం లో భాగంగా ఎందుకు నాటారని ప్రశ్నిస్తున్నారు. చెట్లు చూస్తే ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయని, ఈ చెట్ల ద్వారా ఆక్సిజన్ వెలువడదని , శ్వాసకోస, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయని,విషపూరితమైన చెట్లను వెంటనే తొలగించాలని పట్టణ ప్రజలు ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరుతున్నారు. మనుషుల ఆయుష్షును పెంచే విధంగా ఉండే మొక్కలను నాటించాలని అధికారులని,ప్రజాప్రతినిధులని కోరుతున్నారు.
మనవాళికి మంచి చేసే మొక్కలు పెంచుతాం
పురపాలక సంఘంచైర్మెన్- వస్పరి శంకరయ్య
ఆలేరు పురపాలక సంఘంలో పట్టణంలోని జాతీయ రహదారిపై పెంచిన కోనోకార్పరస్ చెట్లను తొలగిస్తాం.ఈ చెట్లు తొందరగా పెరిగే అవకాశం ఉందని, విషపూరితమైన చెట్లని ముందుగా తెలియని కారణంగానే మొక్కలను నాటాల్సి వచ్చింది. జనగామ సిద్దిపేట జిల్లా కేంద్రాలలో వాటిని తొలగించారు. చెట్లపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం.విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి మొక్కలను వెంటనే తొలగించాల్సిందిగా చెప్పారు.రెండు మూడు రోజులలో విషపూరితమైన చెట్లను తొలగించి వాటి స్థానంలో మానవాళికి మంచి చేసే మొక్కలు పెంచుతాం. పట్టణ ప్రజలు సహకరించాలి.