Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో బుధవారం శోభాకత నామ ఉగాది పర్వదిన వేడుకలు పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ ప్రకతిని కొలుస్తూ వేడుకలు నిర్వహించారు.ఉదయాన్నే ఇండ్లను శుభ్రపరుచుకుని,వాకిళ్లలో ఉగాది ముగ్గులు వేశారు.మామిడితోరణాలు,వేపకొమ్మలతో ముఖద వారాలను అలంకరించారు.శ్రీ కనకదుర్గ ఆలయం, శివాలయం, శ్రీ గోదాదేవి లక్ష్మీదేవి సరిత రంగనాయక ఆలయం, చాముండేశ్వరాలయాలలో భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేదు, పులుపు, తీపి, వగరు, కలగలిపిన వేప ఆకులు, పండు, బెల్లం పానకం కొబ్బరి కలగలిపి పచ్చడి తయారు చేసి ప్రజలకు పంచారు.ఆలయఅర్చకులు ఆలేటి రంగన్న పంతులు, వేదాటి సత్యనారాయణ శాస్త్రి, మంగళగిరి శేషగిరి, మంగళగిరి వరదరాజులు భక్తులకు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు.ద్వారకనగర్లో భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో శుభాకత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ భజరంగ్ యూత్ సభ్యులు ఉగాది పచ్చడిని తయారుచేసి కాలనీవాసులకు పంచారు. శోభాకత నామ ఉగాది నూతన సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడిసునీత, ఉమ్మడి నల్లగొండ జిల్లాడీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ కుడుదుల నగేష్,బూడిద భిక్షమయ్యగౌడ్, టీపీసీసీి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య, ఆలేరు పురపాలక సంఘం చైర్మెన్ వస్పరి శంకరయ్య ,మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ ప్రజలకు శుభాకాంక్షలుత ఎలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, యువతీ యువకులు పాల్గొన్నారు.