Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వలిగొండ రూరల్
మండలపరిధిలోని టేకులసోమారం గ్రామంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం కాగా బుధవారం అఖిల పక్షాల ఆధ్వర్యంలో రోడ్డు బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.ఈ సదర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు రంగులు వేయాలని, రోడ్డు మధ్యలో డివైడింగ్ లైన్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్ వేయాలని కోరారు.మూలమలుపుల వద్ద సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని, పెరిగిన రద్దీ దష్ట్యా వెంటనే రెండులైన్ల రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మార్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు యాదయ్య, లింగస్వామి, శంకర్, అజరు, పరమేష్, స్వామి, మదరాజు, పాక వెంకటేష్,నారగోని రాజు, ఫయాజ్బాబా, గణేష్, బాలు,మురళీ, శశాంక్, వినరు, ఉదరు, భరత్ తదితరులు పాల్గొన్నారు.