Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
మండలంలోని మంతపురి గ్రామం నుండి నల్లపోచమ్మ గుడికి వెళ్లే దారిలోని వాగుపై రైతుల అభ్యర్థన మేరకు గుడికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కల్వర్టు నిర్మాణ కోసం నిధులు మంజూరు కావడంతో మాజీ ఎమ్మెల్యే,జెడ్పీటీసీ కుడుదుల నగేష్ కల్వర్టు నిర్మాణపనులు బుధవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పారుపల్లి లావణ్య నరసింహులు, మాజీ సర్పంచ్ ఎల్లయ్య ,శంకర్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులురాములు, మండల కోఆప్షన్ సభ్యులుగౌస్,ఆలేరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు సంతోష్,గ్రామస్తులు మధుసూదన్‌రెడ్డి,బాలయ్య,సిద్ధులు, చంద్రశేఖర్,స్వామి, సంతోష్,బాలరాజు, రాములు, సత్తయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.