Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశీర్వచనం అందజేసిన వేదపడింతులు
- శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు.శోభకత్ నామ ఉగాది రోజున తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రాలు ధరించిన మంత్రి క్యాంపు కార్యాలయంలో కలియతిరుగుతూ అధికారులకు, బీఆర్ఎస్ నేతలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని వినిపించి మకరరాశికి చెందిన మంత్రికి అంతా జయమే కలుగుతుందని తెలిపారు.అదేవిధంగా ముచ్చటగా మూడవసారి మంత్రి గెలుపొందడం ఖాయమని పేర్కొన్నారు.అనంతరం మంత్రి స్వయంగా ఉగాది పచ్చడిని తయారు చేసి కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శోభకత్ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య పోరాటంతో తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ జాతి అంతా ఒక్కటేనని, ఇందులో ఉన్న ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలన్నారు.నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, వైద్య శాఖలకు చెందిన అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.