Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
సాహిత్యాభిరుచికి ప్రతీకలు ఉగాది కవి సమ్మేళనాలని సాహితీవేత్తలు, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు మంత్రిప్రగఢ భరతారావు, శ్రీరామకవచం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పట్టణంలోని గుంటి రఘునాథ స్వామి ఆలయంలో ఉగాది సందర్బంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. పాశ్చత్య సంస్కతిలో కవులకు, సాహితీ వేత్తలకు గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కవి సమ్మేళనాలు సాహిత్య అభిరుకి ప్రతీకలు అన్నారు. ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహిస్తూ కవులను, సాహితీవేత్తలు ప్రోత్సహిస్తున్న గుంటి రఘునాథ స్వామి దేవాలయ కమిటీ వారు అభినందనీయులన్నారు. కాగా 40 మంది కవులు పలు సామాజిక, ఆధాత్మిక, సాహిత్య అంశాలపై కవితలు రాసి చదివి వినిపించారు. అనంతరం కవులను ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రచయిత సరికొండ రాజు రచించిన వర్ణాలు లేని వాక్యాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉగాది కవి సమ్మేళన కన్వీనర్ ఎస్ఎస్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ గుడుగుంట్ల రంగయ్య, ఎక్సైజ్ అధికారి వీ.సోమిరెడ్డి, కోదాడ రచయితల సంఘ అధ్యక్షులు పుప్పాల కష్ణమూర్తి, నరసింహ రాజు, ధర్మ కర్తల మండలి సభ్యులు వేనేపల్లి శ్రీనివాసరావు, ఆలయ అభివద్ధి కమిటీ సభ్యులు కొమరగిరి రంగారావు, కాటేపల్లి నరసింహరావు, గెల్లా లక్ష్మినారాయణ, పూజారి ఎన్సీహెచ్.రాఘవాచార్యులు, తదితరులు పాల్గొన్నారు