Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
నూతన శోభ కత నామ సంవత్సర ఉగాది వేడుకలను గ్రామ సర్పంచ్ బరపటి ఉపేందర్ వేద పండితులు బ్రహ్మ చారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన ఆశయాలు చిగురించాలని పాడి పంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని పంచాంగ శ్రవణం చూ యించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేల్లి శ్రీలత శ్రవణ్‌కుమార్, దేవాలయ కమిటీ చైర్మెన్ రేటినేని వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్యాల రవీందర్రావు, గ్రామపెద్దలు మారెళ్ళి యాకయ్య, తోట సురేష్,పెద్ది శ్రీనివాస్, బరపటి శ్రీను, పాల్గొన్నారు.
తుంగతుర్తి: మండలకేంద్రంలో పాటు మండలపరిధిలోని అన్ని గ్రామాల్లో శోభకత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అనంతరం తమ తమ ఇండ్లలో మామిడి ఆకులతో తోరణాలు కట్టారు.అనంతరం దేవాలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ప్రత్యేకపూజలు నిర్వహించారు.షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారుచేసి కుటుంబ సభ్యులందరూ సేవించారు.అనంతరం సాయంత్రం దేవాలయానికి వెళ్లి పురోహితుల చేత పంచాంగం చెప్పించారు.ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు తాటికొండ సీతయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు బండారు దయాకర్, ఓరుగంటి సత్యనారాయణ, వాసవిక్లబ్ మండల అధ్యక్షుడు బండా వినయ్ ,భక్తులు పాల్గొన్నారు.