Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య
నవతెలంగాణ-నల్లగొండ
కవిత్వానికి మూలం విద్య అని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో బుధవారం సామాజిక కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల అసమానతలు పెరిగి పేద వర్గాల వారు విద్యకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవితా సమ్మేళనంలో అనేక మంది కవులు సమాజంలో విద్య విలువను తెలియజేశారు. అందరికీ విద్యను అందించడం ద్వారానే సమాజంలో అసమానతలు జరగకుండా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం కవులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, కవులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బైరెడ్డి కష్ణారెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, పురుషోత్తమాచార్యులు చొల్లేటి ప్రభాకర్, సాగర్ల సత్తయ్య, గేర నరసింహ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, పగిళ్ల సైదులు, ప్రభాకర్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.