Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ముస్లింలు సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం మిర్యాలగూడ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్ చావుష్ అధ్యక్షతన అసోసియేన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పలువురు షాదీఖాన, ఈద్గా ప్రహరి గోడ, పట్టా తదితర సమస్యలపై వారికి విన్నవించుకోగా పరిష్కరిస్తామన్నారు. మునిసిపల్ చైర్మెన్ భార్గవ్ మాట్లాడుతూ మిర్యాలగూడ హిందు ముస్లింల ఐక్యతకు నిదర్శనమని, ఏ సమస్య వచ్చినప్పుడు సమన్వయంతో పరిష్కరించుకున్నామన్నారు. ఈ సమావేశంలో మస్జిద్ కమిటీల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ముఫ్తిలు, మౌలానాలు, నాయకులు పాల్గొన్నారు.