Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ప్రకతిలో లభించే పానీయాల వల్ల ఆరోగ్యాలకు ఎంతో మేలు జరుగుతుందని, కత్రిమమైన పానీయాల వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హానికరమైన కత్రిమ పానీయాలు మానేద్దాం- ప్రకతి పాణియాలు సేవిద్దాం అనే నినాదంతో ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రకతిలో లభించే పానీయాల వల్ల ఆరోగ్యాలకు ఎంతో మేలు జరుగుతుందని, కత్రిమమైన పానీయాల వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని అందరూ ప్రకతి పానీయాలు సేవించాలని, ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన టీఎస్ యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీలను అభినందించారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతికి పానీయాలను అందజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరు వెంకటరమణారెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సైదులు టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కోశాధికారి శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్.అరుణ, జిల్లా కార్యదర్శి గేర నరసింహ, నల్లపురాజు వెంకన్న, రమాదేవి ఆడిట్ కమిటీ జిల్లా కన్వీనర్ ఎం. మురళి, సోషల్ మీడియా కన్వీనర్ ఎరనాగుల సైదులు, ఆడిట్ కమిటీ సభ్యులు సైదులు, ప్రచురణాల కమిటీ కన్వీనర్ శ్యామ్ కుమార్, అక్కడమిక్ కన్వీనర్ పగిడిపాటి నరసింహ, మండల బాధ్యులు సిహెచ్.రవీందర్, సైదులు, రమణ, కష్ణ, రాజశేఖర్‌రెడ్డి, నాగయ్య, ఆదిమల్ల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.