Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవశర్మచే పంచాంగ శ్రవణం
ఆకట్టుకున్న బాలు మాస్టర్ కళాకారుల శాస్త్రీయ నత్య ప్రదర్శన
నవతెలంగాణ-నల్లగొండ
శోభకత్ నామ ఉగాది పర్వదిన సందర్భంగా బుధవారం నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి వీటి కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవశర్మ పంచాంగ శ్రవణం ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సంవత్సరం పంచాంగ ఫలితాలలో ధన, ధాన్య సమద్ధి, ఆరోగ్య క్షేమం, సుభిక్షం కలుగుతుందని, ముఖ్యమంత్రికి ఇటు నల్లగొండ ఎమ్మెల్యేకి గోచార రీత్యా శుభం కలుగుతుందని, మంచి విజయాలు సాధిస్తారని, రాజకీయ ఉన్నతి కలుగుతుందని తెలిపారు. బాలు మాస్టర్ నేతత్వంలో చిన్నారులతో నిర్వహించిన శాస్త్రీయ నత్యం ఆహూతులను ఆకట్టుకున్నది. అనంతరం 50 మంది, వేద పండితులు, కవులు, రచయితలు గాయకులు, కళాకారులు, యోగా గురువులను, స్వచ్ఛంద సంస్థల నిర్వావాహకులను ఘనంగా సన్మానించి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రజలందరు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారని పంచాంగంలో తెలియజేయటం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ముఖ్యమంత్రి నేతత్వంలో నల్లగొండ నలు వైపులా జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాలను కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, చర్చించుకోని ప్రజలకు మంచి సందేశాన్ని పంపించాలని కోరారు. ఈ నూతన సంవత్సరంలో మరిన్ని అభివద్ధి కార్యక్రమాలను తీసుకొని నియోజకవర్గ అభివద్ధికి తాము శక్తి వంచన లేకుండా కషిచేసి ప్రజలు కోరుకున్న మార్పును తీసుకోస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ని ఉగాది పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఉగాది పురస్కారాలు పొందిన వారిలో కాటేపల్లి పెద్ద వెంకట నరసయ్య, పున్నమి అంజయ్య, రామచంద్రారెడ్డి శీలం భద్రయ్య, గజవెల్లి సత్యం కత్తుల శంకర్, డాక్టర్ కవిత కోమిశెట్టి, రమాదేవి, యోగా గురువు నాగేశ్వరరావు, రవీంద్ర చారి, నాట్య కళాకారులు సాయి సుధా తేజస్విని, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, కనగల్ ఎంపీపీ ఎస్కే.కరీం పాషా, గ్రంథాలయ చైర్మెన్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు చీర పంకజ్‌యాదవ్, కటికం సత్తయ్యగౌడ్, బొర్ర సుధాకర్, బక్క పిచ్చయ్య, ఫరీదోద్దీన్, మాలే శరణ్యరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు, మండల అధ్యక్షులు అయితగోని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు యామా కవితా దయాకర్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, వట్టిపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్ యాదవ్, ఊట్కూరు వెంకట్‌రెడ్డి, రామాలయం దేవాలయ చైర్మెన్లు చకిలం వేణుగోపాలరావు, గంట్ల అనంతరెడ్డి, సూర మహేష్, నాయకులు రావుల శ్రీనివాసరెడ్డి, పొనుగోటి జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.