Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
జీవో నెం 64 ప్రకారం స్కూల్ స్వీపర్లకు రూ.5200 చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పరిషత్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో స్కూల్ స్వీపర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021 జూన్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ స్వీపర్లకు రూ 4000 నుండి రూ 5200 వరకు పెంచుతూ జీవో నెం 64 ను జారీ చేసిందన్నారు.అయినా నేటికీ జిల్లాలో అమలు చేయకుండా జిల్లా అధికార యంత్రాంగం తాత్సార్యం చేస్తుందని అన్నారు. వెంటనే జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గాదె చంద్రయ్య, నాయకులు జంగయ్య, శ్రీశైలం, జంగయ్య, లక్ష్మి, నర్సింహ, రమేశ్, బాలమ్మ, లక్ష్మమ్మ, అంజయ్య, ఉస్మాన్, బిక్షపతి, జంగయ్య, నర్సయ్య పాల్గొన్నారు.