Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య
నవతెలంగాణ-చౌటుప్పల్
కళ అనేది గ్రామీణ ప్రాంతాల్లోనే దాగి ఉందని దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. బుధవారం రాత్రి చౌటుప్పల్ పట్టణకేంద్రంలో గ్రామీణ కళల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అష్టమ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం భజన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులతో నృత్యాలు, మాందాత చరిత్ర యక్షగాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విఠలాచార్య మాట్లాడుతూ అసలైన గౌరవం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులకు దక్కాలన్నారు. పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న నేటి సమయంలో గ్రామీణ కళలను రక్షించే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటుచేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఆ సమితి ఆధ్వర్యంలో విఠలాచార్యను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, సింగిల్‌విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, కమిటీ అధ్యక్షులు, కౌన్సిలర్ పోలోజు శ్రీధర్‌బాబు, ఎరుకలి మల్లేశ్‌గౌడ్, చిక్క నర్సింహా, సుర్కంటి వెంకట్‌రెడ్డి, దొడ్డి రాములు, వీసం చంద్రారెడ్డి, పాశం రామరాజు, చింతకింది అంజయ్యగౌడ్, గ్యార కిష్టయ్య, బడుగు బాలరాజు, చిట్టిపోలు వెంకటేశం, యాట వెంకటేశం, ఎరుకలి స్వామిగౌడ్ పాల్గొన్నారు.