Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నర్సింహ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పట్టణంలో నిర్మించిన దుంపల మల్లారెడ్డి మెమోరియల్ భవనంలో ఈనెల 28న ప్రారంభిస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ పిలుపునిచ్చినారు. గురువారం మండల పరిధిలోని అనాజిపురం, హమ్మాపురం గ్రామాలలో జన చైతన్య యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనాజిపురం గ్రామంలో కొండమడుగు నర్సింహ, హనుమాపురం గ్రామంలో దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద, కార్పోరేట్ విధానాలను అవలంబిస్తూ ప్రజల బతుకుల పైన భారాలు మోపుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ పరిపాలన కొనసాగిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బీజేపీ మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం మతసామరస్యం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర ఈనెల 28న భువనగిరి పట్టణానికి వస్తున్న సందర్భంగా ,నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు దుంపల మల్లారెడ్డి పేరు మీద నిర్మించిన స్మారక భవనాన్ని ప్రారంభిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభకు ముఖ్య అతిధులుగా పొలిటి బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీమండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, అబ్దుల్లాపురం వెంకటేష్, మోటె ఎల్లయ్య, మండల మాజీ మండల కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, అనాజిపురం గ్రామ శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేశం, రెండు గ్రామాలకు సంబంధించిన నాయకులు ఎండి.జహంగీర్, రాగాల రాజేశ్వర్, కడారి కృష్ణ, బొల్లెపళ్లి కిషన్, తెల్లూరి మాణిక్యం, బుల్లెపల్లి స్వామి సుధాకర్, మైలారం, శివ, నవీన్, జహంగీర్, శేఖర్, అశోక్, ఉప్పలయ్య, బిక్షపతి, నరసింహ, నవీన్, శేఖరు పాల్గొన్నారు.