Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరుపల్లి సీతారాములు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు పిలుపు
నవ తెలంగాణ- వలిగొండ
భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దమని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఆ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు3 ఏసిన సభలో ఆయన మాట్లాడారు. భగత్ సింగ్ 24 ఏండ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం సోషలిస్టు భావాలతో పనిచేసి బ్రిటిషర్లను గడగడలాడించి నవ్వుతూ ఉరికంభం ఎక్కాడన్నారు. ఆయన స్ఫూర్తితో నేడు దేశంలో పెరుగుతున్న మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు .దేశంలో బీజేపీి అధికారంలోకి వచ్చిన 9ఏండ్ల కాలంలో మత ఉన్మాద చర్యలు పెంచి పోషించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రయివేటుపరం చేసిందన్నారు. కార్పొరేట్లకు లాభం చేసే విధానాలకు పాల్పడుతుందన్నారు. భగత్ సింగ్ దేశంలో ఉన్న దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా అందరికీ స్వేచ్ఛ సమానత్వం విద్య వైద్యం కోసం పోరాడడని అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దేశవ్యాప్త జన చైతన్య యాత్రలు జరుగుతున్నాయని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మూడు యాత్రలు ప్రారంభమయ్యాయని ఈనెల 28న భువనగిరి జిల్లా కేంద్రంలో పెద్ద బహిరంగ సభ జరుగుతుందని 29న ముగింపు సభ హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగనుందని ఈ సభకు ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు ఈ సభలను పార్టీ నాయకత్వం విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు లు మాట్లాడుతూ సిపిఎం చేస్తున్న ప్రజా ఉద్యమాలకు పార్టీ కార్యాలయాలు కేంద్రాలుగా ఉంటాయని అన్నారు. చాలా కాలం తర్వాత సీపీఐ(ఎం) సొంత ఆఫీసును ఏర్పాటు చేసుకోవడం మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఉపయోగకరంగా ఉంటుందని నిరంతరం ప్రజలకు పార్టీ కార్యాలయం పార్టీ నాయకత్వం అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ జెండాను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అధ్యక్షత న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీర శ్రీశైలం రెడ్డి తుర్కపల్లి సురేందర్ కల్కూరి రామచందర్ మెరుగు వెంకటేశం, మండల కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఇర్లపల్లి ముత్యాలు క్షవురా వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేషం, కొండే కిష్టయ్య,గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి ,కర్ణకంటి యాదయ్య,కల్కూరి ముత్యాలు,కందడి సత్తిరెడ్డి,దుబ్బ లింగం,ఏలే కృష్ణ,కవిడే సురేష్,బుగ్గ చంద్రమౌళి, నాయకులు దొడ్డి భిక్షపతి,వేముల నాగరాజు,రుద్రపల్లి రామలింగం,వివిధ శాఖల కార్యదర్శులు,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.