Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికి నూతన పరిపాలనను అందించిన నాయకుడు కేసీఆర్
- తెలంగాణలో ఎవరి కాళ్ల మీద వారు నిలబడే శక్తిని ఇచ్చిండు కేసీఆర్
- నాడు తెలంగాణలో వలసలు పోతే... నేడు తెలంగాణకు వలసలు వస్తున్నారు
- విశ్వకర్మ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో ఉందని అన్ని లోహాలను మానవ సమాజానికి అవసరమైన పద్ధతుల్లో మార్చే ఘనత విశ్వకర్మలకే ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డ్డి అన్నారు. విశ్వకర్మ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం స్థానిక చంద్రన్నకుంటలో నిర్మించనున్న విశ్వకర్మ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. సమాజంలో ఏదైనా కార్యక్రమం చేయాలని కొందరు ఉత్సాహవంతులు ముందుకొచ్చినప్పుడు అందరి మద్దతు ఉంటేనే అది సాధ్యమవుతుందని అన్నారు . ప్రస్తుతం తెలంగాణలో ఎవరి కాళ్ళ మీద వారు నిలబడే శక్తి, ఇతరులకు వితరణ చేయగలిగిన శక్తి ఇవాళ తెలంగాణ సమాజానికి వచ్చింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు. మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటన్నింటి విషయంలో తనదైన పద్ధతుల్లో భారతదేశానికి ఒక నూతన పరిపాలన విధానాన్ని అందించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు కుట్రలు చేసిన సందర్భంలో తెలంగాణ దీపాన్ని ఆరిపోకుండా ఉంచి ఈ సమాజానికి కెసిఆర్ చేతికి జయశంకర్ సార్, శ్రీకాంతాచారిలు అందించారని కొనియాడారు. 2014కు ముందు మనం చేద్దామన్న పని దొరికే పరిస్థితి లేదని నాడు 15 లక్షల మందికి పైగా ఇతర రాష్ట్రాలకు వలసలు వెళితే నేడు 35 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వస్తున్నారని తెలిపారు. అన్ని కులవృత్తులను సమాన రీతిలో ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన హయాంలోనే కులవృత్తులకు సమచిత స్థానం లభించిందన్నారు. విశ్వకర్మల సమస్యలన్నీ తన దృష్టిలో ఉన్నాయని ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విశ్వకర్మ భవనాన్ని నిర్మాణానికి ఇప్పటికే 50 లక్షలు మంజూరు చేశామని తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని పేర్కొన్నారు. త్వరలో భవన నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిర్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మెన్్ శ్రీవాణి శ్రీకాంత్ రాజ్, డాక్టర్ రవీంద్ర మోహన్, విశ్వ కర్మ సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు సలేంద్రా చారి,మున్సిపల్ మాజీ ప్లోర్ లీడర్ ఆకుల లవకుశ,సంఘ గౌరవ అధ్యక్షులు కూరెళ్ల రంగాచారి, శ్రీపాద సోమయ్య, ముది మాణిక్యం వీర బ్రహ్మచారి, అధ్యక్షులు తౌడోజు సలేంద్రా చారి, ఉపాధ్యక్షులు రంగు దిలీప్ కుమార్, అకారపు పరిపూర్ణాచారి, ప్రధానకార్యదర్శి కొండ గూడూరు లక్ష్మణా చారి, సంయుక్త కార్యదర్శిలు మేడారపు బ్రహ్మచారి, బహురోజు ఉపేంద్రా చారి, కోశాధికారి, పర్వతం శ్రీధర్ కుమార్, కార్యవర్గ సభ్యులు, కటకం ప్రభాకరా చారి,భోగోజు లక్ష్మి నర్సింహా చారి, అబ్బోజు జానికి రాములు, మారోజు హరిచంద్ర, చౌడోజు వీరాచారి,పర్వతం సైదాచారి, గుండెపురి ఉపేంద్రాచారి, ఆకారపు బ్రహ్మచారి, గౌరవ సలహా దారులు శ్రీపాద భాష్కరా చారి, ఉరిమళ్ల బ్రహ్మచారి, నాగవెల్లి ప్రభాకర్, బ్రహ్మాండ్ల పల్లి వెంకటేశ్వర్లు, న్యాయ సలహా దారులు తోగటి మురళి, మీడియా బాధ్యులు మడూరి బ్రహ్మచారి. పోలోజు శారద తదితరులు పాల్గొన్నారు.