Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట, నల్లగొండ , యాదాద్రిభువనగిరి జిల్లాల్లోని ప్రధాన కూడల్లో భారీ బహిరంగ సభలు
- ఏర్పాట్లను పూర్తి చేసిన జిల్లా కమిటీలు
నవతెలంగాణ-నల్లగొండ
బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం సీపీఎం అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 25 నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రను వరంగల్ లోని ఆజంజాహి మిల్లు గ్రౌండ్లో ఈ నెల 17న సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి యాత్రను ప్రారంభించారు. యాత్రకు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ నాయకత్వం వహిస్తున్నారు. 24న ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని 25న జన చైతన్య యాత్ర నల్లగొండ ఉమ్మడి జిల్లాలో అడుగుపెట్టనుంది. దీంతో సూర్యాపేట నల్లగొండ జిల్లా నాయకత్వం పూర్తి ఏర్పాట్లూ చేసింది. మరో యాత్ర 28న భువనగిరి జిల్లా కేంద్రానికి వస్తుంది. అక్కడ పెద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. 29న ముగింపు సభ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగనుంది.
యాత్ర పర్యటన వివరాలు
సూర్యాపేట జిల్లా లోకి ప్రవేశించిన జన చైతన్య యాత్ర ఈనెల 25న నేలకొండపల్లి కోదాడ హుజూర్నగర్ , 26న నేరేడుచర్ల ,మిర్యాలగూడ, 27న నల్లగొండ, నకిరేకల్ ,చిట్యాల , కేంద్రాలలో భారీ సభలను నిర్వహించనున్నారు. ఈ యాత్ర 28న రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అదిలాబాద్‌లో చేపట్టిన యాత్ర 28న యాదాద్రిభువనగిరి జిల్లాకు రానుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
29న యాత్ర ముగింపు సభ
హక్కుల పరిరక్షణకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ చేపట్టే ప్రచార కార్యక్రమం రాష్ట్రంలోని మూడుచోట్ల ప్రారంభమయ్యాయి.17న వరంగల్‌లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఈనెల 23న ఆదిలాబాద్‌లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. 24న నిజామాబాద్‌లో మాజీ ఎంపీ విజయరాఘవన్ కార్యక్రమాలను ప్రారంభించారు. 29న హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జనచైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రజలను చైతన్యం చేయడం కోసమే జన చైతన్య యాత్రలు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, యువజన, విద్యార్థి, కార్మిక, మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసమే జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రజల మీది నిత్యావసర సరుకుల ధరలు, ముడి చమురుల ధరలు ఇలా అనేక రకాల పద్దతిలో భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తూ నిరంకుశ పాలన చేస్తున్నారు. చేస్తున్నారన్నారు. ప్రజల మధ్య కులాల పేరుతో మతాల పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ సెక్యులర్ భారతదేశం మీద మతోన్మాద భావాజాలాన్ని వ్యాప్తి చేయాలనే కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తుంది. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కలిగిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీి మతోన్మాద ఆగడాలు సాగనివ్వం. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఒకవైపు ధరల భారం మరొకవైపు మతోన్మాద భావజాలం ప్రభావం చూపుతుంటే బీజేపీి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, యువజన, విద్యార్థి ,మహిళ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతాం.
బీజేపీ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
మతోన్మాద బీజేపీ ఆగడాలు రోజురోజు కు పెరిగిపోతున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదం, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్నది. రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. బీజేపీ విధానాలతో దేశానికి, రాజ్యాంగానికి, లౌకిక ప్రజాస్వామ్యానికి ప్రమాదం.
జన చైతన్య యాత్ర ద్వారా జిల్లాలో ఉన్న ప్రజలను సమీక రించి బిజెపి మతోన్మాద విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం. యాత్ర జయప్రదం చేయడం కోసం ప్రజలను జన సమీకరణ చేస్తాం.
కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు:
సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
మోడీ అమిత్ షా ల నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతున్నారు. ప్రజలపై భారాలను మోపుతూ 23 కోట్ల మందిని నిరుపేదలుగా చేశారు.దేశం అంటే అంబానీ ఆదాని సొత్తుగా మార్చేశారు. నూనెలు వంటగ్యాస్ పెట్రోలు డీజిల్ తో సహా అన్ని సరుకులు ధరలు రెండు మూడు రేట్లు పెంచారు. 2014లో 410 ఉన్న గ్యాస్ బండ నేడు 1150 రూపాయలకు పెరిగింది. ఈ ధరలు పెరుగుదల వల్ల కార్పొరేట్ శక్తులు వేలకోట్ల రూపాయలు లాభాలను పోగేసుకుంటున్నారు. లక్షల కోట్లు ఖర్చుపెట్టి బలోపేతం చేసిన ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. జన చైతన్య యాత్ర ద్వారా చేపట్టే బహిరంగ సభలను జయప్రదం చేయాలి.
కోట్లు దోచిపెడుతున్న మోడీ, అమిత్‌షా
యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
మోడీ ,అమిత్‌షా నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మోపుతూ 23 కోట్ల మందిని పేదలుగా చేశారు. దేశమంటే అంబానీ అధానీల సొత్తుగా మార్చేసి ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావలసిన అవసరముంది. బీజేపీ మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం మతసామరస్యం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర ఈనెల 28న భువనగిరి పట్టణానికి వస్తున్నది. సందర్భంగా నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు దుంపల మల్లారెడ్డి పేరు మీద నిర్మించిన స్మారక భవనాన్ని ప్రారంభిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిధులుగా పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహరెడ్డి హాజరుకానున్నారు.