Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరు ఎస్
మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో చెరువు లో పెంచిన చెట్ల ను ఎలాంటి తీర్మానాలు లేకుండా సర్పంచ్ అమ్ముకున్నాడని వార్డు సభ్యులు జిల్లా పంచాయతీ అధికారికి గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఎర్ర కుంటలో ఎన్నో ఏండ్లుగా పెంచిన తుమ్మ వేప చెట్లతో పాటు అంగన్వాడీ పాఠశాల ఆవరణలో ఉన్న భారీ వేప చెట్టును గ్రామ సర్పంచ్ నూతనకల్ మండలానికి చెందిన వ్యాపారికి రూ.30వేలకుపైగా అమ్మగా వ్యాపారి భారీ చెట్ల ను నరికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీకి వచ్చిన అభివృద్ధి నిధులు సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులకు తెలియకుండా దుర్వినియోగం చేస్తున్నట్లు వార్డు సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న సర్పంచ్ ఫై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వార్డు సభ్యులు సంద్యాల సైదులు, మడ్డి మల్లేష్, సందీప్, కోటేష్,బయ్య అరుణ, అనిత, తదితరులు ఉన్నారు.