Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
దేశగతిని మార్చేందుకు కీలక పత్ర పోషించేది బీఆర్ఎస్ పార్టీనే అని శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు శ్రీనివాస్ తెలిపారు. గురువారం మండలంలోని కాపుగల్లు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 6 వేల మంది బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన మండల ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్యఅతిధులుగా హాజరై మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనలను క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయడం కోసం నిర్వహింస్తు న్నామని తెలిపారు. తెలంగాణ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా ఒక కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పాఠశాల అభివద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, జెడ్పీటీసీ కృష్ణకుమారి శేషు, మండల పార్టీ అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, వైస్ ఎంపీపీ రాణి బ్రాహ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, అనంత సైదయ్య, మండలంలోని అన్ని సొసైటీల చైర్మెన్లు, పాలకవర్గ సభ్యులు, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మండల పార్టీ నాయకులు, అన్ని గ్రామలశాఖ అధ్యక్ష కార్యదర్శులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.