Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
మార్చి 25న కోదాడలో జరిగే జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. పట్టణంలో గురువారం సుందరయ్య భవన్లో టౌన్ పార్టీ ముఖ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మార్చి 17న వరంగల్‌లో బయలుదేరిన జన చైతన్య యాత్ర ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ మార్చ్ 25న కోదాడ పట్టణంలోకి వస్తుందని తెలిపారు. ఈ జన చైతన్య యాత్ర సందర్భంగా పట్టణంలో రంగా థియేటర్ చౌరస్తా దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభను ప్రజలు, కార్మికులు, ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు కలిసి జయప్రదం చేయాలని కోరారు. ఈ జన చైతన్య యాత్రకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర జిల్లా నాయకులు హాజరవుతున్నారని వారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరావు, జిల్లా కమిటీ సభ్యులు జే. నరసింహారావు, సీపీఐ(ఎం) టౌన్ కార్యదర్శి ఎం.ముత్యాలు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, కర్ణకోటి నవీన్, వేనేపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరిలో...
అనంతగిరి మండల కేంద్రంలో మార్చి 25న నిర్వహించే జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జుట్టు కొండ వీరయ్య, గోపతి బిక్షమయ్య, కే.వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
సత్యనారాయణ ఆశయాలు సాధించాలి
ఈదర సత్యనారాయణ ఆశయాలు ప్రతి ఒక్కరూ సాధించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. ఈదర సత్యనారాయణ మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం సత్యనారాయణ నివాసంలో ఆయన చిత్రపటానికి నాగార్జున్‌రెడ్డి పూలమాలు వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు. పార్టీకి ఆయన చేసిన సేవల గురించి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరావు, సీపీఐ(ఎం) టౌన్ కార్యదర్శి ఎం.ముత్యాలు, సీఐటీయూ జిల్లా కోశాధికారి కోటగిరి వెంకటనారాయణ, సీపీఐ(ఎం) అడ్వకేట్ వీ.రంగారావు, ఉయ్యాల నరసయ్య, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.