Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -సూర్యాపేట
సూర్యాపేట పట్టణానికి మణిహారంగా ఉన్న సద్దుల చెరువుకు ప్రస్తుతం ఉన్న పర్యాటక శోభ కు తోడుగా ఆధ్యాత్మిక శోభ జత కానుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక సద్దుల చెరువు పై కొలువై ఉన్న కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయానికి ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. వందలాది మంది సభ్యులు గా ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరిక మేరకు సొంత నిధులతో కట్ట మైసమ్మ ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అమ్మవారి దయతో సద్దుల చెరువు తో పాటు క్రింద ఉన్న అనేక చెరువులు పెద్ద ఎత్తున నిండడంతో ప్రజలు, రైతులంతా,మత్స్యకారులు అంత సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ అమ్మవారి దీవెనలు, ప్రజలకు సుభిక్షంగా సకలంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలకు సైతం అమ్మవారి దీవెనలు, నియోజకవర్గ అభివృద్ధి మరింత అభివృద్ధి చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. వచ్చే బోనాల పండుగ నాటికి అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మెన్పుట్టా కిషోర్, కౌన్సిలర్ లు రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి గౌడ్,నాయకులు శభరి, కుంభం రాజేందర్,బూర బాల సైదులు గౌడ్, దేశ గాని శ్రీనివాస్ గౌడ్ ,యేల్గూరి రాంబాబు గౌడ్,మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గౌరవ అధ్యక్షులు ఆకుల లవకుశ, చైర్మెన్‌్ కోటయ్య, ఉపాధ్యక్షులు నల్లమేకల వెంకన్న, ప్రధాన కార్యదర్షి నాగరాజు, కోశాధికారి సురేష్, డైరెక్టర్ నిరంజన్,అంజయ్య జానికీ రాములు, లక్ష్మమ్మ, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.