Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అసలు రూపం బట్టబయలు
- రాహుల్ అనర్హతవేటుపై ఘాటుగాస్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభివర్ణించారు. దీనితో మోడీ అసలు స్వరూపం బట్టబయలు అయ్యిందని ఆయన విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశానికి చీకటి రోజులు అలుముకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాల అణిచివేత కేంద్రం ఎంచుకున్న మార్గంగా కనిపిస్తుందన్నారు. ఎనిమిదేండ్లుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తంతు అదే నంటూ చెప్పారు. విపక్షాల అణిచివేతకే మోడీ సర్కార్ ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ దుర్మార్గాలకు కాలం చెల్లిందని, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి ఘాటుగా స్పందించారు.