Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కౌన్సిలర్ ఆలె నాగరాజు తెలిపారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు దివీస్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ శశిధర్, డాక్టర్ సౌజన్యలు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీచేశారు. 14 లక్షల 45 వేల రూపాయల విలువైన స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, హార్లిక్స్ ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లు, షఉ, సాక్స్ లను విద్యార్థులకు నాగరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి బాలరాజుగౌడ్, ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, భాగ్యమ్మ, దివీస్ సీఎస్ఆర్ ఇన్ఛార్జీ వల్లూరి వెంకటరాజు, సాయికృష్ణ, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.