Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరి
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని పశువైద్య శాల మీటింగ్ హల్ లో సమావేశం నిర్వహింఛారు. అనంతరం క్షయవాధి నివారణ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీనీ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై, మాట్లాడారు. టీబీ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచించారు. సుమారు 20వేల రూపాయల విలువగల పౌష్టిక ఆహార సరుకులను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వై పాపారావు, రోటరీ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, కరివే నర్సింగ్ రావు కార్యదర్శి పలుగుల ఆగేశ్వర్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ తాటిపల్లి రవీందర్ కూచుపట్ల సత్యనారాయణ రెడ్డిబో గ హరికృష్ణ చెన్న లక్ష్మణ్ పాల్గొన్నారు.