Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ- ఆత్మకూర్ ఎం
ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దని రైతులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల మండలంలో కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను శుక్రవారం మండల కేంద్రంలో ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూర్ (ఎం) మోత్కూర్, గుండాల, అడ్డగూడూర్ మండలాల్లో నష్ట ప్రభావం అధికంగా ఉందని ఆమె అన్నారు. ఆలేరు నియోజకవర్గంలోనీ మండలంలో 9138, గుండాల మండలంలో 5400, మోటకొండూరు మండలంలో100,రాజపేటమండలంలో 75 ఎకరాలలోవరిపంటనష్టపోయినట్లుగా ఇప్పటివరకు అధికారులు గుర్తించారని ఆమె చెప్పారు. వరి తో పాటు మామిడి, సపోటా, బత్తాయి తోటలకు కూరగాయల పంటలకు కూడా నష్టం జరిగినట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి రైతులకు అండగా ఉంటున్న ప్రభుత్వం అని,రైతులసంక్షేమంకోరుకుంటున్న ప్రభుత్వం కావడంతో రైతులు అధైర్య పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు 10 వేల అందించి సహయక పునరావృత చర్యలు చేపట్టాలని నిశ్చయం తీసుకున్నారని తెలిపారు.. అందుకు రూ 288 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ బీసు ధనలక్ష్మి గ్రామ కోఆర్డినేటర్లు నాతి స్వామి, నాతిరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ వ్యవసాయ శాఖ ఆలేరు ఏడిఏ బి.వెంకటేశ్వర్లు ,ఎంఏఓ ఎన్.శిల్పా, బీఆర్ఎస్ మండల అధ్యక్షులుబీసు చందర్ గౌడ్ నాయకులు పంజాల వెంకటేష్ సోలిపురం అరుణ బూడిది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.