Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
గిరిజనుల ఆరాధ్య దైవంగ భావిస్తున్న సంత్ సేవాలాల్ ఆదర్శాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ స్థాయి సంతోష్ సేవాలాల్ 284వ జయంతి ఉత్సవాలను శుక్రవారం మండల కేంద్రంలోని జైహింద్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఆనాడు సేవాలాల్ గిరిజనుల అభివృద్ధిని కోరుకుంటే నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ప్రతి గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వందని అన్నారు.ప్రతి తండాలో గ్రామపంచాయతీ భవనంతో పాటు సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.గిరిజనుల అభివృద్ధిలో భాగంగా రూ.1కోటి50 లక్షలతో బంజారా భవన్, గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.తన సొంత నిధులు రూ.10 లక్షలు తో సంతు సేవాలాల్ మందిరం నిర్మిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి ప్రేమ్చందర్ రెడ్డి, చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి,జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్,సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి,ఎంపీటీసీ బచ్చనబోని గాలయ్య,పిఎసిఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి,గిరిజన సంఘం నాయకులు భీమ్లా నాయక్,స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ రాజ్,ఎంపీడీవో రాములు,పలు గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.