Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగను దొంగ అంటే తప్పేంటి..?
- జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రజాస్వామ్యంలో తప్పుడు కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా మా అధినాయకుడు మాట్లాడతారని, నీరవ్ మోదిని దొంగ అంటే తప్పేముందని, రాహుల్ గాంధీ పై వేధింపులు సరికాదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన జిల్లా కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. నీరావ్ మోడీ నీ దొంగ అన్నాడని, ప్రధాని మోడీని అనలేదని, దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన వ్యక్తి దేశ ప్రజల కోసం సమస్యలపై మాట్లాడితే సూరత్ కోర్టులో అతనిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తామనడం సరికాదన్నారు. దేశ సమైక్యత కోసం పాదయాత్ర చేస్తున్న అధినేతపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని, లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు త్రీవా ఇబ్బందులు పడుతున్నట్లు, తొమ్మిది సంవత్సరాలుగా ఇలాంటి నోటిఫికేషన్ వేయకుండా, రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ ఎన్నికలలో హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చి ఏదో ఘనకార్యం చేసినట్టు విద్యార్థులు కష్టపడి రాసిన పేపర్లను క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం ప్రభుత్వ సమర్థతకు, వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ఈ విషయంపై బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా టిపిసిసి ఆదినేత రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ సిట్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం మన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, తంగేలపల్లి రవికుమార్, బీసుకుంట్ల సత్య నారాయణ, సిరికొండ శివకుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.