Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ ఎంపికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామపంచాయతీలలో 9 విభాగాలలో అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన మొదటి మూడు గ్రామాలను జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీలుగా కలెక్టర్ పమేలా సత్పతి ఎంపిక చేశారు. మొదటి విభాగం పేదరిక నిర్మూలన, సరియైన జీవనోపాధి కలిగిన జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీలుగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం, ఆలేరు మండలం కొలనుపాక, బీబీనగర్ గ్రామపంచాయతీ ఎంపిక అయ్యాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో మోటకొండూరు మండలంలోని ఇక్కుర్తి గ్రామపంచాయతీ, ఆలేరు మండలంలోని మంతపురి గ్రామప ంచాయతీ, తుర్కపల్లి మండలంలోని వాసా లమర్రి గ్రామపంచాయతీ ఎంపిక అయ్యాయి. బాలల స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో రామన్నపేట మండలంలో ఇంద్రపా లానగరం (తుమ్మ లగూడెం), వలిగొండ మండలంలో పహిల్వాన్ పురం, బీబీనగర్ మండలం లో మేడి తండా గ్రామ పంచాయతీలు ఎంపిక య్యాయి. సరిపోను నీటి వనరులు విభాగంలో భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామం, చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటం, గుండాల మండలంలోని గంగాపూర్ గ్రామం , పచ్చదనం పరిశుభ్రత విభాగంలో చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటం, పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ గ్రామం, భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామం ఎంపికైంది. సరియైన మౌలిక సదుపాయాలు విభాగంలో రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామం, రాజపేట మండలంలోని రేణిగుంట గ్రామం, వలిగొండ మండలంలోని సంగం గ్రామం ఎంపికైంది. సామాజిక భద్రత విభాగంలో బీబీనగర్ మండలంలోని అన్నంపట్ల గ్రామపంచాయతీ, మోటకొండూరు మండలంలోని దిలావర్పూర్, రాజపేట మండలంలోని జాల గ్రామాలు ఎంపిక కాగా, ప్రజలకు సుపరిపాలన అందించే గ్రామపంచాయతీలుగా భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామం, పోచంపల్లి మండలంలోని సాయి నగర్, బొమ్మలరామారం మండలంలోని రామలింగంపల్లి గ్రామం , ఫ్రెండ్లీ మహిళల గ్రామపంచాయతీ విభాగంలో పోచంపల్లి మండలం శివారెడ్డి గూడెం, బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామం, తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామాలు ఎంపికయ్యాయి. జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికలో భాగంగా 9 విభాగాలలో మూడు గ్రామపంచాయతీల చొప్పున మొత్తం 27 గ్రామపంచాయతీలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేశారు. ఈనెల 26వ తేదీన జిల్లా మంత్రి చేతుల మీదుగా నల్గొండ జిల్లా కేంద్రంలో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా ఉత్తమ గ్రామం జిల్లా గ్రామపంచాయతీలో ఎంపికైన గ్రామపంచాయతీలు రాష్ట్రస్థాయిలో పోటీ పడనున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైన వాటిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు.