Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం
నవతెలంగాణ -ఆత్మకూర్ ఎం
ఈ నెల 28నభువనగిరిలో జరిగే సీపీఐ(ఎం) పార్టీజనచైతన్య యాత్ర బహిరంగసభకు ప్రజలు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం కోరారు. శుక్రవారం మండలంలోని కూరెళ్ల, పల్లెర్ల, ఆత్మకూర్ గ్రామాల్లో బహిరంగ సభ ప్రచార గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. సందర్భంగా ఆయనమాట్లాడుతూకేంద్ర ప్రభుత్వ మతోన్మాద, ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలపై ,భారత రాజ్యాంగాన్ని ఎత్తివేసే విధంగా బిజెపి ప్రభుత్వ కుట్రలపైన ప్రజలకు తెలియజేస్తూ సి పి ఎం పార్టీ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు జన చైతన్య యాత్రలునడుస్తున్నాయని తెలిపారు. అదిలాబాద్ లో ప్రారంభమైన జాతా మార్చి 28న జిల్లాకు వస్తున్న సందర్భంగా పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభిచుకొని, బహిరంగ సభ నిర్వహించడంజరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల భిక్షం, మండల కమిటీ సభ్యులు వంటిపెళ్లి గోపాల్ రెడ్డి, భాషబోయిన బుగ్గయ్య ,గున్నబోయిన స్వామి, తుమ్మలగూడెం యాదయ్య ,యాదిరెడ్డి, రామ్ రెడ్డి ,బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్/ఆలేరుటౌన్ : ఆలేరు మండల కేంద్రంలో మండల కమిటీ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమరయోధులు దుంపల మల్లారెడ్డి స్మారక అర్థం భువనగిరి పట్టణంలో నిర్మించిన ఆ పార్టీ జిల్లా కార్యాలయం మార్చి 28 న ప్రారంభిస్తున్నామని ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బివి. రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య ,జూలకంటి రంగారెడ్డి ,నంద్యాల నరసింహారెడ్డి పాల్గొంటున్నారని ప్రారంభ కార్యక్రమంలో తెలిపారు ..ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలు అభ్యుదయ వాదులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దుపటి వెంకటేష్, టౌన్ కార్యదర్శి ఇక్బాల్ ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుదగాని సత్య రాజయ్య ,నల్ల మాస తులసయ్య ,సంఘీ రాజు, జాలపు లక్ష్మి ,ఘనగాని మల్లేష్ ,కేతావత్ లక్ష్మి, చౌడబోయిన యాదగిరి ,డివైఎఫ్ఐ సీనియర్ నాయకులు వడ్డమాను విప్లవ్ కుమార్ ,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : 28న భువనగిరిలో జరిగే సీపీఐ(ఎం) బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జన చైతన్య యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బి వి రాఘవులు , మాజీ శాసన మండలి సభ్యులు చేరుపల్లి సీతారాములు, మాజీ కేంద్ర కమిటి సభ్యులు యస్ వీరయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు కొక్కొండ లింగయ్య, తలారి మాతయ్య,వెంకటేశం, కోట నాగరాజు, గుంటి శ్రీశైలం, రామోజీ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట: దేశ భవిష్యత్తుకే ప్రమాద కరమైన మథున్మాద విధానాలను వ్యతిరేకించాలని సీపీఐ (ఎం) పట్టణ కార్యదర్శి కాద నరేందర్, మండల కమిటీ సభ్యులు కందుల హనుమంతు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ విధానాలను అవలంబిస్తూ మోడీ, అమిత్ షా నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు రూపాయలను కట్ట బేడుతూ ప్రజలపై గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరల భారం అవుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి భావడ్లపల్లి సత్యం, రైతు సంఘం నాయకులు బోళ్ళ వెంకన్న, యువజన సంఘం నాయకులు మునుకుంట్ల లెనిన్, పార్టీ నాయకులు గంజి అశోక్, కే వెంకన్న, పల్లె సత్యం, లింగస్వామి, గొరిగే మల్లేశం, సిఐటియు నాయకులు వెంకట్ రెడ్డి, పెయింటింగ్ వర్కర్స్ నాయకులు చింతల గోరయ్య, పాల్గొన్నారు.