Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
మహిళను,విద్యార్థులను అగౌరవపరుస్తూ అసభ్య పదజాలంతో అవమానకరంగా ఆంధ్రప్రభ పత్రిక లో హెడ్లైన్ పెట్టి తప్పుడు స్టోరీ రాసిన నిందితున్ని చట్ట ప్రకారం శిక్షించాలని ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ జమ్మిగడ్డ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా కే జి ఎఫ్ నర్సింగ్ కళాశాలలో అక్రమాలు జరుగుతున్నాయి అని అసత్య ప్రచారం చేస్తూ ఆ కళాశాల వ్యభిచార గృహం అని విద్యార్థులు అశ్లీల కార్యకలాపాల చేస్తున్నారని అసత్యపు ప్రచారం చేస్తూ గత ఆరు నెలలుగా ఆంధ్రప్రభ విలేకరి పత్రికల్లో ప్రచురిస్తూ విద్యార్థులను అవమాన పరుస్తూ అసభ్యకర పదజాలంతో పత్రికల్లో ముద్రిస్తూ విలేకరి పేరుతో దందా చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ విద్యాలయాలను వ్యభిచార గృహాలుగా రాస్తూ ఇలా అబద్ధపు రాతలు రాసే విలేకరులపై చట్టపరకారం చర్య తీసుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పూజారి పద్మ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పీజిఎఫ్ నర్సింగ్ కళాశాలలో వంట మనిషిగా పని చేసే నాపై ఫాదర్ భాష వారితో అక్రమ సంబంధం ఉందని నా పేరు ప్రస్తావిస్తూ నన్ను అవమానపరిచి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా తప్పుడు రాతలు రాసిన రాపర్తి మహేష్ పై చట్టరితే చర్య తీసుకోవాలని పూజారి పద్మ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పి జి ఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ కళాశాలలో చదివిన విద్యార్థులకు వివిధ కార్పొరేట్ హాస్పిటల్లో విదేశీ ఉద్యోగాలలో మంచి అవకాశాలు వచ్చాయి అటువంటి కళాశాల విద్యార్థులను అవమానపరచు పరుస్తూ వ్యభిచారులుగా రాసలీలలు జరుగుతున్నాయని వ్యభిచార గృహంగా కనీస జ్ఞానం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులమని గ్రహించకుండా తప్పుడు రాతలు రాస్తున్న విలేకరిపై చర్య తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కి జిల్లా కలెక్టర్ కి విన్నవించినట్టు చెప్పారు..ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు దాసరి వెంకన్న మాదిగ, పుట్టల మల్లేష్ మాదిగ, దైద వెంకన్న మాదిగ,చింత వినరు బాబు మాదిగ పాల్గొన్నారు.